సకాలంలో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలి…
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
సాక్షిత పెద్దపల్లి :ఆర్&బీ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఆర్&బీ శాఖ అభివృద్ది పనుల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పెద్దపల్లి కాటారం పరిధిలో జరుగుతున్న రొడ్డు విస్తరణ, బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. లింగాపూర్ రొడ్డు సంబంధించి విస్తరణ పనులు, మీడియన్, పైప లైన్ పనులు చేయాలని అన్నారు.
రొడ్డు విస్తరణ పనులు సంబంధించి విద్యుత్ పోల్స్ తరలింపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి లో నిర్మించిన ఆర్&బీ గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, సంబంధిత వివరాలను ఎంబీ రికార్డులలో నమోదు చేసి బిల్లులు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. మానేరు నది పై చేపట్టిన బ్రిడ్జి టెండర్ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. రోడ్లు నిర్మించే సమయంలో త్రాగు నీటి పైప్ లైన్ పనులకు డ్యామేజి జరుగకుండా చూడాలని అన్నారు.
మంథని గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. కునారం ఆర్ఓబి సంబంధించి అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూ సేకరణ పూర్తి చేశామని, అక్కడ ఇండ్ల, ఇతర నిర్మాణాల కూల్చివేత పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మంథని స్టేడియం నిర్మాణానికి సంబంధించి అవసరమైన అనుమతులు త్వరగా సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో ఈఈ ఆర్ అండ్ బీ భావ్ సింగ్, డీఈలు, ఏఈలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY