బాపూనగర్ రోడ్ నెం.5లో రూ.23.25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 285 డివిజన్ పద్మానగర్ పరిధిలోని బాపూనగర్ రోడ్ నెం.5లో CMC నిధుల ద్వారా రూ.23 లక్షల 25 వేల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి కాలనీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం బాపూనగర్‌లోని శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కె.ఎం. గౌరిష్ , డీసీసీ జనరల్ సెక్రటరీ బంటు నరేష్ , డీసీసీ సెక్రటరీ ఎం.డి. జాకీర్ , డివిజన్ అధ్యక్షులు గడ్డం స్వాతిక రాజేందర్ రెడ్డి , ఇరుగు రాధాకృష్ణ , బస్తీ అధ్యక్షులు జగదీష్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి దయానంద్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు కయ్యుమ్, ఆకోడే శ్రీనివాస్, పెంటయ్య, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
