SAKSHITHA NEWS

దుర్గం చెరువుపై రెవిన్యూ ఫోకస్ : సీఎం రేవంత్ సోదరుడితో సహా 24 మందికి నోటీసులు

ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన రెవెన్యూ శాఖ.. ప్రతి చెరువును పరిశీలిస్తుంది. ఈ క్రమంలోనే దుర్గం చెరువు పరిసరాల్లోని నిర్మాణాలపై దృష్టి పెట్టింది సర్కార్. దుర్గం చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్లకు.. శేరిలింగంపల్లి తహశీల్దార్ నోటీసులు అందించారు. 30 రోజుల్లోగా సమాధానం చెప్పాలని.. ఆ తర్వాత స్వచ్ఛంధంగా కూల్చివేయాలని ఆయా నిర్మాణాల యజమానులకు నోటీసుల్లో స్పష్టం చేశారు అధికారులు.

దుర్గం చెరువు పరిసరాల్లోని నిర్మాణాలకు నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం కూడా ఉండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కో ఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ లోని నివాసాలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. మొత్తం 204 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఇల్లు అన్ని పెద్ద పెద్ద బంగ్లాలు.. లగ్జరీ విల్లాలు.. లగ్జరీ అపార్ట్ మెంట్స్ ఉన్నాయి.

దుర్గం చెరువు చుట్టూ ప్రముఖుల నివాసాలే ఉన్నాయి. ఒక్కొక్కరు వందల కోట్ల రూపాయలతో ఈ ఇళ్లను నిర్మించుకున్నారు. నోటీసులు అందుకున్న 204 ఇళ్లు.. దుర్గం చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. 30 రోజుల్లో ఈ 204 ఇళ్లను కూల్చేస్తారా లేదా అనేది చూడాలి..


SAKSHITHA NEWS