రిటైర్మెంట్ అనేది వయసుకు మాత్రమే….బాలికల విద్య

రిటైర్మెంట్ అనేది వయసుకు మాత్రమే….బాలికల విద్య

SAKSHITHA NEWS

రిటైర్మెంట్ అనేది వయసుకు మాత్రమే….బాలికల విద్య అభ్యున్నతికై కృషిచేయాలనే మీ సంకల్పానికి కాదు : అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ శ్రీ హరి రవీంద్రనాథ్ పదవి విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ….

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్ పల్లి లోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ హరి రవీంద్రనాథ్ పదవి విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై హరి రవీంద్రనాథ్ ని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ రవీంద్రనాథ్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయ పురస్కారం లభించడమే కాకుండా గణితశాస్త్రంలోనూ ప్రమోషన్ పొందారని ఘట్కేసర్ బాలికల పాఠశాలలో మంచి అభ్యున్నతిని కల్పించి బాలికల విద్యాభివృద్ధిలో తోడ్పడ్డారని నియోజకవర్గంలోని బహదూర్ పల్లి పాఠశాలలో 10 సంవత్సరాలు సేవలందించి పదవి విరమణ పొందుతున్నందుకు ఎంతగానో ఆనందంగా ఉందని తెలిపారు. పదవి విరమణ అనేది వయసుకు మాత్రమేనని బాలికల విద్యా అభ్యున్నతి కోసం కృషిచేయాలని మీ సంకల్పానికి కాదన్నారు.

ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు మైసికారి సునీత వెంకటేష్, సత్యనారాయణ, నిజాంపేట్ కార్పొరేటర్ మేకల వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సగ్గిడి శ్రీనివాస్, శ్యామ్ మరియు ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

రిటైర్మెంట్ అనేది వయసుకు మాత్రమే….బాలికల విద్య

SAKSHITHA NEWS