
ఫిర్యాదు ఇచ్చిన వెంబటనే స్పందించిన: ఆంధ్రప్రదేశ్ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు
పల్నాడు జిల్లా దుర్గి మండలం
అడిగోప్పల గ్రామం లో లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కు 2003 లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రభుత్వం 34 ఎకరాలు ల భూమిని మాదిగలకు కేటాయించడం జరిగింది. నాలుగు రోజుల నుండి ఆ భూమిలో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ నాయకత్వం 17/03/2025 న సోమవారం నాడు గ్రీవెన్స్ లో MRPS ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు MRPS ఇచ్చిన కంప్లెన్ట్ మీద వెంటనే స్పందించి ఆ 34 ఎకరాల సదరు భూమిని సందర్శించారు, పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కు కేటాయించిన భూమిలో ఎవరైతే అక్రమంగా ఈ భూమి లో మట్టిని తరలించారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మండల ఎమ్మార్వో కి తెలియపరచరు, రెండవదిగా లిడ్ క్యాప్ కు సంబందించిన 34 ఎకరాల లో గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 16 ఎకరాలు జగనన్న ప్లాట్స్ కి ఇవ్వడాన్ని మండిపడ్డారు, స్థానిక MRO అక్రమంగా మైనింగ్ చేసిన వారిపై తగు చర్యలు ఉంటాయని మాట ఇవ్వడం జరిగింది. వీరితోపాటు పల్నాడు జిల్లా ఇన్చార్జి రెడ్డబోయిన ప్రసన్నకుమార్ మాదిగ,MRPS రాష్ట్ర అధికార ప్రతినిధి కోటా సుబ్బు మాదిగ, జిల్లా కన్వీనర్ పేరు పోగు రామయ్య మాదిగ,జిల్లా కో కన్వీనర్ గుండాల నగేష్ మాదిగ,దుర్గి మండల అధ్యక్షుడు పేరు పోగు సాగర్ మాదిగ, జనసేన నాయకులు కిషోర్ , గోపి మేకల దాసు తదిదారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app