Resigned from office the day after taking oath
ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే పదవికి రాజీనామా
సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణకుమారి రాయ్ తన ఎమ్మెల్యే పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఆమె ఎందుకు రాజీనామా చేశారో కారణాలు వెల్లడి కాలేదు. ఆమె రాజీనామాను స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నంచిసింగితాంగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు.