SAKSHITHA NEWS

కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వివేకానంద నగర్ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించడం జరిగినది.

ఈ సందర్భంగా ప్రగతి నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో మౌలిక వసతులు కలిపించినదుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అదేవిధంగా కాలనీ లో అంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజి వ్యవస్థను మెరుగుపర్చలని, అవసరమున్న చోట UGD పైప్ లైన్లు వేయాలని , విధి దీపాలను ఏర్పాటు చేయాలని PAC చైర్మన్ గాంధీ ని వినతి పత్రం ద్వారా కోరడం జరిగినది.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే ప్రగతి నగర్ కాలనీ లో పర్యటిస్తానని, ప్రగతి నగర్ కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. త్వరలనే అవసరమున్న చోట UGD పైప్ లైన్ లు ఏర్పాటు చేస్తామని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్ని పనులను దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
కాలనీ లో అవసరమున్న చోట విధి దీపాలను ఏర్పాటు చేస్తామని, విధి దీపాలను సక్రమంగా వెలిగేలా చూడలని అధికారులకు తెలియచేసారు.

అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ,ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ప్రగతి నగర్ కాలనీ వాసులు తిరుపతిరావు, విజయ్ కుమార్, ప్రేమ్ కుమార్, రాము, ముత్తయ్య, ప్రభాకర్, రెడ్డి మోహన్ ,సారయ్య, వినోద్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS