
గ్రామంలో వీబీకే లను తొలగించి నూతన వీబీకేలను నియమించాలని గ్రామస్తులు ఆందోళన
ఏపీఎంకు వినతిపత్రం అందించిన మహిళా సంఘం సభ్యులు
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మండల పరిధిలోని రామారం గ్రామంలో సంఘం బందాల్లో డబ్బుల దుర్వినియోగానికి పాల్పడ్డారాని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మహిళా సంఘ సభ్యులు ఆందోళనకు దిగారు.
సంఘబంధం 1 మరియు సంఘం 2 వీబీకేలు మహిళా సంఘాలకు ఇవ్వవలసిన శ్రీనిధి డబ్బులను వీబీకేలు వారి సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారని ఇదేమని ప్రశ్నించిన మహిళా సంఘ సభ్యులకు సమాధానం చెప్పకుండా ఇష్టానుసారంగా వ్యవహరించాలరని మహిళా సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సైతం అవకతవకలు చేశారని అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా వారి సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులను తీసుకొచ్చారని మహిళా సంఘం అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలిని గ్రామస్తులకు అవకాశం ఇవ్వకుండా బీహార్ నుంచి తీసుకొస్తున్నట్లు గ్రామ హమాలీలు విబీకేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ రైతులకు మరియు మహిళా సంఘ సభ్యులకు తక్షణమే న్యాయం చేయాలని ఏపిఎం కు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు సునీత,రాధిక, కళమ్మ,శోభ,రంగమ్మ,సరోజన,రామలింగమ్మ,బుచ్చమ్మ,ఉమ,కొమరమ్మ గ్రామస్తులు పల్స మల్లేష్, పల్స సైదులు, తీగల శ్రీను,గాజులు శ్రీను, మేకల దయాకర్, బోడ శ్రీను,రమణాచారి,గాజుల యల్లయ్య, కప్పల సైదులు, ముక్కాముల శ్రీను, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app