SAKSHITHA NEWS

*సాక్షిత : నగరంలో ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ఉదయం 22 వ వార్డులోని ఎల్.ఎస్.నగర్, తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అలాగే ఎమ్మార్ పల్లి వద్ద గల అన్నా క్యాంటీన్ ను పరిశీలించారు. చాముండేశ్వరి ఆలయం సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద చెత్త కుప్పలు ఉండడంతో వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడా చెత్తకుప్పలు కనిపించ రాదని, ఎప్పటికప్పుడు వాటిని తొలగించాలని అన్నారు. రోడ్లపైన, కాలువల్లో చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అన్నారు. ప్రతి ఇంటికి ఆటో వెళ్లి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని అన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణ బాగా చేయాలని అన్నారు. ఎమ్మార్ పల్లి వద్ద గల అన్నా క్యాంటీను పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, డి.ఈ. మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసిపి బాలాజి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app