SAKSHITHA NEWS

నిర్లక్ష్యపు డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలి-తల్లోజు ఆచారి

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందిన సంఘటన

నాగర్ కర్నూల్ జిల్లా సాక్షిత ప్రతినిధి

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్యామల (23) రెండో ప్రసవం కోసం సోమవారం ఆసుపత్రి లో చేరారు. మంగళవారం ఆడబిడ్డ కు జన్మనిచ్చి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరణించింది. విషయాన్ని తెలుసుకున్న మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆచారి మాట్లాడుతూ ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత డాక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాడు. సంఘటన గడిచి 24 గంటలు అవుతున్న ఒక్క అధికారి కూడా స్పందించలేదని అన్నారు. పేదవారు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే తిరిగి ఇంటికి వెళ్తారనే నమ్మకం లేకుండా పోతుందని,డాక్టర్ల పై ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలు మాత్రం దుర్భరస్థితిలో ఉన్నాయని,కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినా కల్వకుర్తి లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఆపరేషన్ చేసిన డాక్టర్ అన్నపూర్ణ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పూర్వం గ్రామాలలో ఉండే మంత్రసానులు డెలివరీ సురక్షితంగా చేసేవారు అలాంటిది ఇంత టెక్నాలజీ పెరిగినా డాక్టర్లు డెలివరి చేస్తే చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, మృతురాలి కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఒక ఉద్యోగం, డబల్ బెడ్ రూమ్, ఇవ్వాలని అదేవిధంగా వారం రోజుల్లో డాక్టర్ ని సస్పెండ్ చేయకుంటే భారతీయ జనతా పార్టీ తరపున భారీ ఎత్తున ధర్నా చేస్తామని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app