రూ.67000 పలికిన రావుల పల్లి కాలాన్ వివేకానంద యూత్ గణపతి లడ్డు
వేలం పాటలో పోటీ పడి లడ్డు దక్కించుకున్న శ్రీ రాములు గౌడ్
రావుల పల్లి కాలాన్ గ్రామ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన లడ్డు
*శంకర్ పల్లి
గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా జరిగే లడ్డు వేలం పాట కార్యక్రమం రావులపల్లి కలాన్ గ్రామంలో ఎంతో ఆసక్తిగా కొనసాగింది. తొమ్మిదవ రోజైన నిమర్జన ఊరేగింపు ఎంతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివేకనంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతి విగ్రహం వద్ద చివరి రోజైన 9వ రోజు ఆదివారం రోజున నిమజ్జనం సందర్భంగా వేలంపాట నిర్వహించారు. లడ్డు అత్యధికంగా రూ. 67000 పలకడం విశేషం. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గౌండ్ల శ్రీరాములు గౌడ్ వేలం పాటలో పోటీపడి మరీ గణపతి లడ్డును దక్కించుకున్నారు. వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు శ్రీరాములు గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించి, ఆ మహాగణపతి ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు గౌడ్ మాట్లాడుతూ ఆ మహాగణపతి ఆశీస్సులు మరియు కృప రావుల పల్లి గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా మహాగణపతి విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఊరేగింపులో భాగంగా భజనలు మరియు నృత్యాలతో ఊరేగింపు ఆసక్తిగా కొనసాగింది.ఈ నిమజ్జన కార్యక్రమంలో వివేకానంద అసోసియేషన్ సభ్యులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.