యునైటెడ్ ఫ్రంట్ లోకి రావాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ ను విజయవాడలో ఆయన కార్యాలయంలో నిర్వహించిన భేటీలో రావుసుబ్రహ్మణ్యం బృందం ఆహ్వానించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ఆయనకు వివరించారు. జేడీ లక్ష్మీ నారాయణ సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు సిద్ధం అని అందరం కలిసి పనిచేద్దామని తెలిపారు.
కార్యక్రమంలో నవతరంపార్టీ నుండి రావుసుబ్రహ్మణ్యం,షేక్ రజాక్,నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుండి షేక్ జలీల్,అల్ ఇండియా జైహింద్ పార్టీ నుండి అంబటి నాగమల్లేశ్వరరావు, జన సహాయక శక్తి పార్టీ నుండి షేక్ ఉమర్ బాషా, నేషనల్ నవక్రాంతి పార్టీ నుండి కనకం శ్రీనివాసరావు,ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుండి ఎల్ జైబాబు,ఆప్ రాష్ట్ర కన్వీనర్ పోతిన రామారావు,ఆప్ నుండి కందుల పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.