SAKSHITHA NEWS

లంచం తీసుకుంటూ పోలీసులకు పట్టుబడిన రామసముద్రం ఎస్సై

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై*

రామసముద్రం ఎస్సై ఓ లారీ యజమాని దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం లోని రామసముద్రం మండలంలో ఎస్సైగా పనిచేస్తున్న వెంకటసుబ్బయ్య ఏటవాకిలికి చెందిన లారీ ప్రమాదానికి సంబంధించిన కేసులో ఓ వ్యక్తి వద్ద 20 వేలు లారీ యజమాని దగ్గర లంచం డిమాండ్ చేశాడు. దీంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు వలపన్ని పెట్రోల్ బంకు వద్ద ఎస్ఐని పట్టు కున్నారు. అయితే రామసముద్రంలో ఏసీబీ అధికారులు ఎస్ఐ ని పట్టుకున్నారని తెలియడంతో కలకలం రేపుతోంది. నిందితుడి అరెస్టు వివరాలను మరికొంత సేపట్లో వెల్లడించునున్నట్లు డిఎస్పి తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app