SAKSHITHA NEWS

భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారానికి ఎంపికైన రామకోటి రామరాజు
గత 25సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక సేవలు చేస్తున్న రామకోటి రామరాజు
……………………………….
సాక్షిత గజ్వేల్ :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ తెలుగు వెలుగు జాతీయ స్వచ్చంద సేవా సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్రల నుండి వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారికి జాతీయ స్థాయిలో పురస్కారాలను ఈనెల 30న ఆదివారం నాడు కరీంనగర్ లో ప్రధానం చేయనున్నారు.

అందులో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకు భక్తిరత్న జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారని సంస్థ చైర్మన్ పోలోజు రాజకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ
రామకోటి రామరాజు గత 25సంవత్సరాల నుండి చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు గుర్తించి ఇస్తున్నటువంటి భక్తిరత్న జాతీయ పురస్కారం అన్నారు. పాతికెళ్ళ నుండి నిర్వీరామంగా రామ నామమే ప్రాణంగా భావించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది భక్తులచే రామకోటి లిఖింపజేస్తూ అధ్యాత్మిక, మార్గాన్ని చూపిస్తూ, లోక కళ్యాణార్తం ఎన్నో యజ్ఞ యాగాలు నిర్వహించి. ఎన్నో ధార్మిక, సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. భద్రాచల దేవస్థానమే సాక్షాత్తు మరో భక్త రామదాసుగా కీర్తించి ఘనంగా సన్మానించిన గొప్ప రామభక్తుడు రామకోటి రామరాజు అని, ప్రజలను భక్తి మార్గం వైపు మల్లె విధంగా కృషి చేస్తున్న రామకోటి రామరాజు అభినందనీయులు అని అన్నారు.

భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారానికి ఎంపికైన రామకోటి

SAKSHITHA NEWS