
రామగుండం పోలీస్ కమీషనరేట్
ఎలాంటి భయలు లేకుండా నిర్భయంగా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
ఒత్తిడి నీ అధిగామించి పరీక్షలకు సిద్ధం కావాలి : డీసీపీ కరుణాకర్
యువతకి వాలీబాల్ కిట్స్ పంపిణి
పోలీసులు-మీకోసం లో భాగంగా ఓదెల మండలంలోని పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ- విద్యార్థులకు అవగాహన సదస్సు, ప్యాడ్స్, పెన్స్ పంపిణి కార్యక్రమం ను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పోత్కపల్లి పోలీస్ ఆధ్వర్యంలో ZPHS- ఓదెల పాఠశాలలో నిర్వహించడం జరిగింది అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పెద్దపల్లి డీసీపీ P. కరుణాకర్ హాజరై విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడ్లడడం జరిగింది. పరీక్ష సామగ్రి పరీక్ష ప్యాడ్స్, కంపాస్ బాక్స్, పెన్స్ ను డిసిపి కర్ణాకర్,పెద్దపల్లి ఎసిపి జి.కృష్ణ చేతుల మీదుగా అందజేశారు.
ఈసందర్బంగా డీసీపీ మాట్లాడుతూ…పరీక్షల సమయం దగ్గర పడే కొద్ది విద్యార్థులలో ఆందోళన ఉంటుందని భయం ఆందోళన విడి ఆత్మవిశ్వాసం ఉంటే అంతిమ విజయం మీ సొంతం అని డి సి పి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు నిర్భయంగా ఎలాంటి భయాలకు, ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో వార్షిక పరీక్షలు రాయాలని సూచించారు.. ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగాలని సూచించారు. దాదాపుగా ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులే ఉంటారువారందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తారు కాబట్టి వారికి సహకారంగా పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేసి రాబోయే వార్షిక పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. పదవ తరగతి అనేది జీవితంలో ఒక మొదటి మెట్టుగా భావించి చదువు చెప్పిన గురువులకు కన్న తల్లిదండ్రులకు మనం పుట్టి పెరిగిన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని,విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేద నకు గురికాకూడదని మంచి ఆలోచనతో చదువుకోవాలని డీసీపీ సూచించారు.
కనగర్తి, ఓదెల, పోత్కపల్లి మండలాలకు చెందిన యువతకి వాలీబాల్ కిట్స్ అందజేయడం జరిగింది.
డిసిపి ఏసిపి , ఇతర పోలీసు అధికారులు అందరూ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ, సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్సై ధీకొండ రమేష్, సిబ్బంది, వై రమేష్ ఎంఈఓ,, హరి ప్రసాద్ జిహెచ్ఎంఈఓ జి అంజన్ కుమార్, అనిత సైకియాట్రిస్ట్, లక్ష్మీనారాయణ ఇన్చార్జ్ హెచ్ఎం జెడ్ పి హెచ్ ఎస్ ఓదెల, బి సాంబయ్య జిహెచ్ఎంపిహెచ్ఎస్ పోత్కపల్లి, ఎన్ ఏసుదాసు జిహెచ్ఎం జడ్.పి.హెచ్.ఎస్ కొలనూరు, వై రమేష్ జిహెచ్ఎం జడ్పిహెచ్ఎస్ కనగర్తి, ఈ జె సర్వోత్తమ్ రెడ్డి ఇన్చార్జి హెచ్ఎం జడ్.పి.హెచ్.ఎస్ గుంపుల, జి శ్రీనివాస్ ప్రిన్సిపల్ మోడల్ స్కూల్, కే జ్యోతి కేజీబీవీ స్కూల్ ఓదెల, మరియు టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app