ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతి లో చేరారు.
బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు రామ్ కోటి తో పాటు 350 మందికి పైగా జాగృతి లోకి ఆహ్వానించారు.
కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..
- జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది.. అదే విధంగా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది.
- ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు రూ. 2500 నెలకు ఇస్తామంటూ మోసం చేసినందుకు మనం కొట్లాడాలి.
- ప్రసవం కోసం ఆస్పత్రులకు వెళ్లిన మహిళలకు గతంలో కేసీఆర్ కిట్ వచ్చేది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బంద్ అయింది.. అడబిడ్డలకు కిట్ ల సాధన కోసం ప్రభుత్వం పై కొట్లాడాలి.
- పేదింటి బిడ్డ పెళ్లికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వలేదు. దాని కోసం మనం కొట్లాడాలి.
- ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటూ గద్దెనెక్కి కనీసం ఒక్క ఉద్యోగం ఇయ్యలేని పరిస్థితి. దాని కోసం కొట్లాడాలి.
- ముఖ్యంగా బీసీ బిల్లు తెస్తామని తేనందుకు మనం కొట్లాడాలి.
- జాగృతి అంటేనే పోరాటాల జెండా.. జాగృతి అంటేనే విప్లవాల జెండా.
- ఒక్కటి కాదు రెండు కాదు అన్ని అంశాలపైన ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిద్దాం

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
