తను ప్రజల మనిషి – అతనికి ప్రజా సేవే లక్ష్యం”

Sakshitha news

తను ప్రజల మనిషి – అతనికి ప్రజా సేవే లక్ష్యం”

తుంగతుర్తి ప్రతినిధి : తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పస్తాల గ్రామ నాయకుడు బుక్క శ్రీనివాస్ జీవన విధానం ప్రజలకు ఆదర్శంగా నిలుస్తోంది. రాజకీయ అధికారమేమీ లేకుండా గత పదేళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ముందుండి పోరాడుతున్న బుక్క శ్రీనివాస్, ప్రతి ఇంటి గడప వద్దకు వచ్చే సమస్యను తన సమస్యగా భావిస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ నిరంతరం సేవా మార్గంలో ముందుకు సాగుతున్నాడు. నాగారం మండలం పస్తాల గ్రామానికి చెందిన శ్రీనివాస్, గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి బిఆర్ఎస్ పార్టీ అధికార బలం ముందు తక్కువ మెజార్టీతో ఓడిపోయినా, ప్రజల గుండె గదిలో మరొక నేతగా నిలిచిపోయాడు.కుటుంబాన్ని వదిలి ప్రజల సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన, తనకు అవకాశం లభిస్తే ప్రతి ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి, గ్రామానికి అన్ని విధాల న్యాయం సాధిస్తానని వాగ్దానం చేశాడు.ప్రజా నాయకుడిగా మార్పు సృష్టించేందుకు నాటిన ఆశ. తన విజయాన్ని కేవలం అధికారంలోకి రావడంగాను చూడకుండా, ప్రజాశ్రేయస్సు కోసం స్ఫూర్తిగా సాగిపోతున్నాడు.ప్రజల సమస్యలను నిత్యం తెలుసుకుంటూ, వారికోసం ప్రభుత్వ దశలను శాశ్వత పరిష్కారం దిశగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడని స్థానికులు చెబుతున్నారు.

భవిష్యత్‌పై బుక్క శ్రీనివాస్ అభిప్రాయం

“నా వంతుగా ఊరికి అన్ని రకాల న్యాయం చేస్తాను, ప్రతి సమస్యకు ముందుండి నడుస్తాను. అవకాశం లభిస్తే అనునిత్యం ప్రజలతోనే ఉంటానంటూ, ప్రజలకు అందుబాటులో ఉండగలనన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నాను,” అని బుక్క శ్రీనివాస్ పేర్కొన్నారు. పదవుల్లో లేకపోయినా, ప్రజలకు నిజమైన సేవ చెయ్యడమే తన ధ్యేయమని, స్వప్రయోజనం కన్నా ప్రజల ఆశలకు ప్రాధాన్యం కల్పించడం తనకు ముఖ్యమని చెప్పారు. గ్రామ, మండలాల్లోనే కాకుండా, నియోజకవర్గంలోని తదితర గ్రామాలకు తన సేవలను విస్తరించాలనే సంకల్పంతో ప్రజలకు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ విధంగా, ప్రజా సేవను జీవిత ధ్యేయంగా మార్చుకున్న బుక్క శ్రీనివాస్, తక్కువ వ్యవధిలోనే ఆదర్శ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతూ, స్థానిక రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.