
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకే రాజీవ్ యువ వికాస పథకం :- మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..!
మేడ్చల్ మున్సిపాలిటీ,మేడ్చల్ ఉమ్మడి మండల,మేడ్చల్ పట్టణ నిరుద్యోగ యువతీ,యువకులకు తెలియజేయునది ఏమనగా బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం రాజీవ్ యువ వికాస పథకం ప్రారంభించిందని. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సి ఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించడం హర్శనీయమని,రాజీవ్ యువ వికాస పథకంతో నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుందని,స్వయం ఉపాధి పొందేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు.ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 5లక్షల మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు సుమారు 6వేల కోట్ల రాయితీ రుణాలను ప్రజా ప్రభుత్వం మంజూరు చేయనుందని మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ అన్నారు.
రాజీవ్ యువ వికాస్ దరఖాస్తు చేసుకోవడానికి బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ వారు అప్లై చేసుకోవడానికి కావలసిన పత్రాలు..!
ఆధార్ కార్డు…
క్యాస్ట్ సర్టిఫికెట్…
ఇన్కమ్ సర్టిఫికెట్2025..
బ్యాంక్ అకౌంట్…
తెల్ల రేషన్ కార్డు…
పుట్టిన తేది…
పాస్ ఫోటో…
పాన్ కార్డు…
వికలాంగులు(సదరం సర్టిఫికెట్)…
చదువుకున్న సర్టిఫికెట్స్…
పైన తెలిపిన విధంగా అన్ని సర్టిఫికెట్లు తీసుకొని ఆన్ లైన్ సెంటర్ లల్లో ఆఖరి తేది 05.04.2025 లోపు అప్లై చేసుకోవాలని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాస పథకంతో బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ నిరుద్యోగ జీవితాల్లో వెలుగులు నింపడం ఖాయమని,పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలియజేసారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app