SAKSHITHA NEWS

భారతదేశంలో ఐటీ విప్లమానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ
జయంతి వేడుకల్లో కాంగ్రెస్ జాతీయ నాయకులు గిడుగు రుద్రరాజు
……
సాక్షిత రాజమహేంద్రవరం, : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 80వ జయంతి కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన స్థానిక నాయకుడు కాటెం రవి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు, రాజమహేంద్రి విద్యాసంస్థల అధినేత టి.కె విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక జాంపేట బ్రిడ్జ్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. ఆయన భారతదేశ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, యువత కోసం తీసుకొచ్చిన ఐటి విప్లవం, పంచాయతీ రాజ్ చట్టం, మరియు మహిళల సాధికారతకు చేసిన కృషిని ప్రశంసించారు.

దేశంలోనూ, రాష్ట్రంలోను ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటూ ప్రజల పక్షాన అధికార పార్టీని నిలదీస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. 11 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా తన బాధ్యతను మరిచారన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానిగా గెలుపొంది దేశాన్ని మతతత్వ శక్తుల నుంచి విముక్తి కల్పిస్తారని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేసిన మహనీయుడు అని అభిప్రాయపడ్డారు. అనంతరం సుమారు వందమంది మహిళలకు చీరలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బోడా వెంకట్, బిల్డర్ బాబీ,బర్రె సుబ్రహ్మణ్యం, బెజవాడ రంగ, మాతా శారదా,, లీలావతి, బత్తిన చంద్రారావు, చమర్తి లీలవతి, మండా రాజు, వి. సత్యనారాయణ, మైనారిటీ నాయకులు అబ్దుల్లా షరీఫ్ మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 20 at 18.21.48

SAKSHITHA NEWS