బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ప్రజల మనిషి రాజన్న
చౌటుప్పల పట్టణ కేంద్రంలోని తంగడిపల్లి 5,వ వార్డు BC కాలనీ నుండి సుమారు రెండు(2) కిలోమీటర్ల వరకు
బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభించడం జరిగినది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సహకారంతో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగినది.
తంగడపల్లి నుండి చౌటుప్పల కేంద్రానికి లింకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయడం జరిగింది.
మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు రోడ్డు నిర్మాణం పనులు పరిశీలించారు. వారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి వాహనాల(గమ్యాన్ని) రవాణా మార్గాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండమీది మల్లేష్,పోలోజు అనిల్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల యేసు, ఎర్రగోని లింగస్వామి,శ్యామకూర యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.