అమరావతి
రాజదాని ఫైల్స్ సినిమా విడుదల బ్రేక్.
తీర్పును వెలువరించిన ఏపి హైకోర్టు.
సీఎం జగన్ మోహన్ రెడ్డిని అవమానించేలా చిత్రీకరించారని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.
రేపటి వరకు సినిమా విడుదల చేయవద్దని హై కోర్టు ఆదేశాలు.
సినిమాకు సంబంధించిన అన్ని రికార్డ్స్ సబ్మిట్ చేయాలని సెన్సార్ బోర్డుకు హై కోర్టు ఆదేశం.
కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హై కోర్టు.
అమరావతి: ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్‌సెట్ మాల్లో అర్థంతరంగా నిలిపివేశారు..
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని ప్రదర్శించవద్దని నోటీసులు ఇచ్చారు. సినిమాను మధ్యలో ఆపివేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు కొని చూస్తుంటే మధ్యలో ఎలా నిలిపివేస్తారని నిలదీశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే ఆపేశామని అధికారులు పేర్కొనగా.. ఆర్డర్ కాపీని చూపించాలని పట్టుబట్టారు..
మరోవైపు గుంటూరు జిల్లా ఉండవల్లిలో మరియు మంగళగిరిలో సినిమా ప్రదర్శన నిలిపివేతపై రైతులు ధర్నాకు దిగారు. ఉండవల్లి రామకృష్ణ థియేటర్ మరియు మంగళగిరి ఊర్వశి థియేటర్ వద్ద తెదేపా నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది..