SAKSHITHA NEWS

రైతాంగ ప్రజా నిరసన సదస్సుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రణభేరి మోగించిన ……….బి ఆర్ఎస్.
వేలాధిగా తరలివచ్చ రైతులకు సంఘీభావం తెలిపిన రైతు,కార్మిక, కర్షక విద్యార్థి మహిళా లోకం

సాక్షిత వనపర్తి :
అన్నదాతను హరిగోసా పెడుతున్న ,రైతులను చెప్పుతో కోడతామన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెంప చెళ్లుమనిపించేలా కదలివచ్చిన వెలాదిరైతులు రైతాంగ ప్రజా నిరసన ద్వారా జెంగు సైరన్ మోగించారు.
రైతులు రుణ మాఫీ కాక రైతు భరోసా రాక,మద్దతు ధర లేక ,రైతు భీమా రాక నానా అవస్థలు పడుతున్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. మాజి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి పాల కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన రైతు ప్రజా నిరసన సభకు మాజీ మంత్రి
హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి హయాములో వ్యవసాయం పండుగలాగ సాగిందని 1లక్ష పదివేల ఎకరాలకు నీరిచ్చిన ఘనత నిరంజన్ రెడ్డి ది అని అన్నారు.
రైతులను,కార్మికులను కర్షకులను,మహిళలను,విద్యార్థులకు వాగ్దానాలు చేసి ఎగ్గోట్టిన రెవంతు రెడ్డి ఏనుముల రేవంత్ కాదని ఎగవేతల రేవంత్ అని అన్నారు.


దేవుండ్ల మీద ఓట్లు అడిగినోల్లకు తిట్లు అంటూ కాంగ్రెస్ వ్యవహరిస్తుందని
పదీనెలల కాలములో ఇంత ప్రజాఆగ్రహాన్నికి గురైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని రైతులకు ఇచ్చిన హామీలు,మహిళలకు ఇచ్చిన హామీలు, వయోవృద్ధులకు ఇచ్చిన హామీలు,యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మా నాయకులను కార్యకర్తలను వేధిస్తున్నారని వాళ్ళను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగతి తెలుస్తామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
డాక్టర్.అంబేద్కర్ చౌరస్తా నుండి భారీగా సాగిన ర్యాలితో బి.ఆర్.ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది.


SAKSHITHA NEWS