రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని..
దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్..
పెగడపల్లి : మేక్ ఇన్ ఇండియా పేరుతో బీజేపీ అన్ని కాంట్రాక్టులను ఆదానికి ఇస్తోందని ఇజ్రాయిల్ తయారు చేసిన ఆయుధాలకు, డ్రోన్లకు అదాని స్టిక్కర్లు అంటించి మేక్ ఇన్ ఇండియా అని అంటున్నారని చేసిన ఆరోపణల్లో నిజం లేదని బీజేపీ ప్రభుత్వంలో దేశం ఎదుగుతుంటే రాహుల్ జీర్ణించుకోలేకే చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు.
పుట్టిన దేశాన్ని విమర్శించడం అంటే కన్నతల్లిని శంకించడమేనని రాహుల్ గాంధీ విమర్శలు చూస్తుంటే సోనియా గాంధీని విమర్శించడం లాంటిదేనని అన్నారు. రాహుల్ కు భారతదేశం మీద ఏనాడు ప్రేమ లేదని అందుకే తను ఏరోజు విదేశీ గడ్డపై అడుగుపెట్టిన అక్కడ తను పుట్టిన గడ్డను విమర్శిస్తూ ఉంటాడని సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు రాహుల్ వ్యాఖ్యలను సమర్తిస్తారని అందుకే కాంగ్రెస్ అంటేనే అది దేశద్రోహపు పార్టీ అని తనకు తానే ముద్ర వేసుకుందని అన్నారు.ఇటీవలే జరిపిన విదేశీ పర్యటనలో భారతదేశంలో హింస, విద్వేషం ఎక్కువ అని,గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో ఎన్నికల కమిషన్ జవాబుదారితనంగా ఎన్నికలు నిర్వహించలేదని ఆరోపించి భారతదేశం పరువు తీశారని ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అనుకూలంగా ఎన్నికలు జరిగాయని భావించేవారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఆదానీలు, అంబానీలు 2014 కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకే వారు పారిశ్రామిక వేత్తలుగా అవతారం ఎత్తలేదని వారు ఇవాళ ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు కావడానికి కారణం కాంగ్రెస్సే అని అన్నారు. గతంలో కూడా భారత సైనికుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీని కాంగ్రెస్ భావి భారత ప్రధానిగా ఊహించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు…