SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ “సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్” కాలమానిని ఆవిష్కరించిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

కుత్బుల్లాపూర్ లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై
నూతన సంవత్సర 2025
కాలమాని (క్యాలెండర్) ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వారి స్వప్రయోజనాల కోసం కాకుండా స్థానికంగా ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటారని అన్నారు. గత పదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ గ్రామంలో అనేక నిధులు వెచ్చించి అభివృద్ధి పరచామని, ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉంటే పరిష్కరిస్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్ భరత్ సింహా రెడ్డి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారులు జి. బలవంత్ రెడ్డి, అధ్యక్షులు ఎస్.నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం, కోశాధికారి ఆర్. మురళి గౌడ్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. లింగం గౌడ్, ఉపాధ్యక్షులు ఎన్. నాగేష్, జి.నరహరి గౌడ్, రామన్ దురసి స్వామి, సంయుక్త కార్యదర్శి జి. సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలు కె. లక్ష్మణ్ చారి, ఎస్. వీరారెడ్డి, బి. బిక్షపతి, సభ్యులు సిహెచ్.రమేష్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ చౌదరి, నాయకులు కుంట సిద్ధిరాములు, కుంట వేణు ముదిరాజ్, నార్ల కంటి శ్యామ్, ఆటో బలరాం, చిన్న, నార్లకంటి కుమార్, కాలే నాగేష్, కాలే గణేష్, నారాయణ, మహిళా నాయకురాలు అరుణా రెడ్డి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS