SAKSHITHA NEWS

నియోజకవర్గ అభివృధ్ధి కోసం తపన… ముందస్తు ప్రణాళికలతో కార్యాచరణ…

నియోజకవర్గ అభివృద్దే నా ప్రథమ కర్తవ్యం : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు…

ఈరోజు పేట్ బషీరాబాద్ లోని క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలో 93 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు 46 కోట్లతో చేపట్టనున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

లింక్ రోడ్లతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం….
నగరంలో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడంలో భాగంగా నియోజకవర్గంలో చేపడుతున్న లింక్ రోడ్ల నిర్మాణ పనులలో భాగంగా భూదేవి హిల్స్ నుంచి లెనిన్ నగర్ , సూరారం జంక్షన్ నుంచి మెట్కానీగూడ మీద ఉషా ముల్లపూడి చౌరస్తా వరకు, స్కందానగర్ నుంచి రాజీవ్ గాంధీ నగర్ వరకు, ఫాక్స్ సాగర్ రోడ్డు, హెచ్ఆర్డిసిఎల్ తో సమన్వయం చేసుకుంటూ లింకు రోడ్డు పనులను చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.

చెరువుల సుందరీకరణ…
చెరువుల సుందరీకరణలో భాగంగా పెద్ద చెరువు, పరికిచెరువు, ఫాక్స్ సాగర్, వెన్నెలగడ్డ చెరువులను అభివృద్ధి పరిచి హైదరాబాద్ నగరంలోనే కుత్బుల్లాపూర్ నియోజకవర్గన్ని పిక్నిక్ స్పాట్ లాగా తీర్చిదిద్దాలి.

వైకుంఠ ధామాలను మోడ్రన్ గ్రేవ్ యార్డ్ గా తీర్చిదిద్ది ఉద్యానవనంలా తీర్చిదిద్దాలి…
వైకుంఠ ధామాలను మోడ్రన్ గ్రేవ్ యార్డ్ గా, ఉద్యానవనంలా మాదిరి తీర్చిదిద్దాలి. వైకుంఠ ధామాల అభివృధ్ధిలో భాగంగా కళావతి నగర్, భగత్ సింగ్ నగర్, పద్మా నగర్ ఫేజ్ -2, అంబేద్కర్ నగర్, దేవేందర్ నగర్, చంద్రగిరి నగర్ ముస్లిం గ్రేవ్ యార్డ్, అయోధ్య నగర్ వైకుంఠ దామాలను మోడ్రన్ గ్రేవ్ యార్డ్ లుగా తీర్చిదిద్దడంతో పాటు నియోజకవర్గంలోని ప్రతిస్మశాన వాటికను అభివృద్ధి కై వ్యయ ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పనులు చేపట్టాలి.

వరద నీటి కాలువల నిర్మాణం చేపట్టాలి…
వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలలో నీరు నిలవకుండా, నాలాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువల నిర్మాణం చేపట్టాలి.

క్రీడా మైదానాలను అందుబాటులో ఉంచాలి…యువతను ప్రోత్సహించాలి…

యువత విద్యకే పరిమితం కాకుండా శారీరకంగా దృఢంగా ఉండేందుకు క్రీడాలు ఎంతగానో ఉపయోగపడతాయి. క్రీడాభివృద్ధిలో భాగంగా గాజులరామారం, ఎస్.ఆర్.నాయక్ నగర్, గోదావరి హోమ్స్ (బ్యాడ్మింటన్ కోర్ట్) గాయత్రి నగర్, ఆర్.కె. లేఅవుట్, మిథిలా నగర్ లలో (బాస్కెట్ బాల్, వాలీబాల్) లను నిర్మించడంతోపాటు వీలైనన్ని క్రీడా మైదానాలలో వాకింగ్ వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేయాలి.

పార్కుల సుందరీకరణతో మెరుగైన జీవన ప్రమాణం…
నియోజకవర్గం లోని పార్కుల సుందరీకరణతో ఆహ్లాదకర వాతావరణాన్ని రూపొందించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి. ఇందులో భాగంగా పార్కులలో వాకింగ్ ట్రాకులు, ఓపెన్ జిమ్ముల నిర్మాణంతోపాటు పాత పార్కుల నిర్వహణకు చర్యలు చేపట్టండి.

జంక్షన్ల అభివృద్ధితో రహదారులకు ఆహ్లాదకరమైన రూపం…
బాలానగర్ – నర్సాపూర్ ప్రధాన రహదారిలోని షాపూర్ నగర్ చౌరస్తా, సూరారం చౌరస్తా, కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద గల చౌరస్తాలతో పాటు గాజుల రామారం చౌరస్తా, జగద్గిరిగుట్ట లాస్ట్ బస్టాప్ చౌరస్తాలను అభివృద్ధి పరచాలి.

బతుకమ్మ ఘాట్ ల నిర్మాణంతో మరింత ఘనంగా పూల పండుగ…
మహిళలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే బతుకమ్మ పండుగలో భాగంగా బతుకమ్మ బండలో నిర్మించిన బతుకమ్మ ఘాట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి బతుకమ్మ ఘాట్లను నియోజకవర్గం లోని నీ ప్రాంతాలలో వీలైనన్ని చోట్ల నిర్మించి మహిళా సోదరీమణులకు అందుబాటులో తీసుకురావాలి.

రహదారుల అభివృద్ధి… నియోజకవర్గ అభివృద్ధికి సూచిక…

రోడ్ల అభివృద్ధికై ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో జలమండలి శాఖ వారు పూర్తిచేసిన డ్రైనేజీ, తాగునీటి సరఫరా పైప్లైన్ రోడ్, రోడ్లను గమనించి వాటిని గుర్తించి తక్షణమే అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ శాఖతో సమన్వయ పరుచుకుంటూ ముందుకు వెళ్లాలని, రోడ్ల అభివృద్ధితోనే నియోజకవర్గ అభివృద్ధి సూచిస్తుందని నియోజకవర్గంలోని ముఖ్య దారులైన జగద్గిరిగుట్ట – షాపూర్ నగర్ పైప్ లైన్ రోడ్డు విస్తరణను 80 ఫీట్లకు విస్తరించదాంతో పాటు రోడ్డులో 30 ఫీట్ల కల్వర్టు నిర్మాణానికై ప్రణాళికలు రూపొందించాలని, సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డు, కుత్బుల్లాపూర్ గ్రామం రోడ్డు త్వరగా చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే గారు అధికారులకు సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఈఈలు లక్ష్మీ గణేష్, కిష్టప్ప, డిఈ రూపాదేవి, పాపమ్మ, శిరీష, ఏఈలు మల్లారెడ్డి, కల్యాణ్, తిరుపతి, స్వాతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS