స్వచ్ఛమైన ప్రాణవాయువు పచ్చదనం పెంపుతోనే సాధ్యమవుతుంది..!
సబీహా గౌసుద్దీన్
సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ రాక్ గార్డెన్ పార్క్ (సున్నం చెరువు పార్క్) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రాణవాయువు పచ్చదనం పెంపుతోనే సాధ్యమవుతుందని, పర్యావరణ అసమతుల్యతతో కాలుష్య సమస్యలు తలెత్తుతున్నాయని, దీంతో కొత్త కొత్త రోగాలకు దారితీస్తుందని, మానవులకు ఎంతో చేటు చేస్తున్నాయని రేపటి తరానికి పరిశుభ్రమైన గాలి నీరు అందించడమే లక్ష్యంగా చేసుకుని ఒక ఉద్యమంలా చెట్లు నాటాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఓ ప్రసాద్, యుబిడి సిబ్బంది, ఎస్ఎఫ్ఏలు, ఆర్పిలు, పెసరి సంజీవరెడ్డి, బొల్లు శ్రీనివాసరావు, విట్టలయ్య, టీవీఎస్ రాజు, రుణంకి జగన్నాథం, విజయ్ గౌడ్, మాధవచారి, రవీందర్ రెడ్డి, గుత్తికొండ రామకృష్ణ, సత్యనారాయణ, రామారావు, తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛమైన ప్రాణవాయువు పచ్చదనం పెంపుతోనే సాధ్యమవుతుంది
Related Posts
బీఆర్ఎస్కు మంత్రి శ్రీధర్ బాబు 10 ప్రశ్నలు
SAKSHITHA NEWS బీఆర్ఎస్కు మంత్రి శ్రీధర్ బాబు 10 ప్రశ్నలు తెలంగాణలో అమరవీరుల సంఖ్యను బీఆర్ఎస్ తగ్గించిందని విమర్శ అధికారంలో ఉన్నప్పుడు అమరవీరుల కుటుంబాలను విస్మరించిందని మండిపాటు పార్టీని విలీనం చేస్తామని మాట తప్పారన్న శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలకు మంత్రి…
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్…
SAKSHITHA NEWS సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్… సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదని.. గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడాలన్నారు. గాలిమోటర్లో…