మార్కెట్ యార్డు పదవి వ్యవహారంలో పుల్లారావు ఆశీస్సులు కందిమళ్ళ తిరుపతి రాయుడుకు దక్కేనా?
పెద్దల ఆశయాల సాధనే లక్ష్యంగా కందిమళ్ల తిరుపతిరాయుడి ప్రస్థానం.
ప్రజల సేవలోనూ పెద్దతరం స్పూర్తిని కొనసాగిస్తూన్న వైనం.
ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ విజయానికి కృషి.
కందిమళ్లతిరుపతిరాయుడికి మార్కెట్ యార్డు చైర్మన్ కేటాయించాలని కోరుతున్న నియోజకవర్గ రైతాంగం. పట్టణ కందిమళ్ళ కుటుంబ అభిమానులు.
చిలకలూరిపేట:
తరాలు మారినా పాత తరం స్పూర్తిని కొనసాగించటం . ప్రజల కోసం, వారి బాగు కోసం తరాలుగా పెద్దతరం బాధ్యతను భుజాన్న వేసుకొని ఆచరించటం, ప్రజల్లో మేమకమై జీవించటం కొందరికే సాధ్యం. ఇటువంటి వారిలో చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామానికి చెందిన కందిమళ్ల తిరుపతిరాయుడు ఒకరు. నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారంలో తమను నమ్మిన వారి కోసం సంపదనుసైతం తృణప్రాయంగా భావించిన కుటుంబం. ఒకప్పుడు వారి కుటుంబ సభ్యులు చిలకలూరిపేట నియోజకవర్గానికి శాసన సభ్యులుగా పనిచేశారు. నియోజకవర్గంలోని ప్రజల అభ్యున్నతికి కోసం తపించారు. సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నా కాసింత ఆచరణ మిన్న … అన్న సూక్తిని విశ్వసిస్తూ పెద్దల త్యాగాలను కొనసాగిస్తూ, వారి బాటలో పయణిస్తూన్నారు కందిమళ్ల తిరుపతి రాయుడు. ప్రస్తుతం తెలుగు యువత పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
రాజకీయాలు ప్రజల సేవ కోసమే..
రాజకీయాలు ప్రజలకు విస్తృతంగా సేవ చేయటానికే అని తిరుపతిరాయుడు కుటుంబ సభ్యులు బలంగా విశ్వసిస్తారు. అందుకే వారు రాజకీయాల్లో ప్రవేశించారు. ఇందులో భాగంగానే ఇంటగెలిచి రచ్చగెలవాలన్న కాంక్షతోనే చిలకలూరిపేట మురికిపూడి గ్రామంలో వీరి కుటుంబసభ్యులు 50 సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు. గ్రామానికి మొదటి తరం సర్పంచులుగా కందిమళ్ల బుచ్చయ్య తండ్రి తిరుపతిరాయడు వారి కుటుంబ సభ్యులే వ్యవహించారు. మురికిగ్రామ సమగ్రాభివృద్ది ప్రభుత్వ సాయంతో ఆధారపడకుండా సొంత నిధులు వెచ్చించి మరీ అభివృద్ది చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్యం,( గుడి, బడి, ఆస్పత్రి) దేవాలయాలు ఇలా గ్రామంలో అన్ని వసతులు సమకూర్చారు. సొంతనిధులతోనే 1950 సంవత్సం నుంచి గ్రామంలో ఉన్నత పాఠశాల, దానికి అనుంబంధంగా ఎస్సీ బాలురవసతి గృహం, పశువులకు ఆసుపత్రి భవనం, పోస్టాఫీసు, గ్రంధాలయం, సొసైటీ భవనం, రక్షిత మంచినీటి పథకం, రోడ్లు, మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. తిరుపతి రాయుడు తాత కందిమళ్ల బుచ్చయ్య 1967లోనే చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం అదే కుటంబానికి చెందిన డాక్టర్ కందిమళ్ల జయమ్మ 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరి హయాంలో చిలకలూరిపేట నియోజకవర్గం అనేక విధాలుగా అభివృద్ది చెందింది.
నాడు బుచ్చయ్య హయంలో చిలకలూరిపేటకు రక్షిత మంచినీటి పథకం, విద్యుత్ అందుబాటులోకి వస్తే, అనంతరం జయమ్మ పరిపాలన కాలంలో మరిన్ని వసతులు సమకూరాయి. తిరుపతి రాయుడు తండ్రి కందిమళ్ల కమలనాభుడు సర్పంచుగా పనిచేశారు.వీరు కళారంగం పోషణకు ఎంతో కృషి చేశారు. కళావాహిని పేరుతో కళాపరిషత్ ఏర్పాటు చేయడంతో పాటు అనేక కళాపరిషత్‌ల మనుగడకు సహకారం అందించేవారు.
టీడీపీ విజయానికి కృషి…
కందిమళ్ల తిరుపతిరాయుడు 2004లో టీడీపీలో చేరినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ క్రీయశీలక పాత్ర పోషించారు. సర్పంచ్, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లోనూ తన సొంత నిధులు వెచ్చించి టీడీపీ విజయానికి కృషి చేసేవారు. నియోజకవర్గ ప్రజలతో ఉన్న సంబంధాలను వినియోగించుకొని గెలుపుకు వ్యూహాలు రచించటం, టీడీపీ విజయానికి అహర్నిశలు పనిచేయటం తిరుపతిరాయుడి వ్యక్తిత్వం. ఈ క్రమంలోనే పలువురితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి.జనసేన పార్టీ యువనాయకులు మండలనేని చరణ్‌తేజ, సోదరుడు సాయినాథ్, వారి తండ్రి సుబ్బారావులతో ఉన్న సంబంధాలతో, వారి బందు వర్గం, కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలతోపాటు నియోజకవర్గంలో ఉన్న పరిచయాలతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గెలుపులో కీలక పాత్ర పోషించారు. కందిమళ్ల వంశీకుల సేవలను తిరుపతిరాయుడు కొనసాగిస్తున్నారు. ఇప్పటికి గ్రామంలోనే పేదల ఆడపిల్లల పెళ్లీల సందర్బంగా వారికి తాళిబొట్లు బహుకరించటం సాంప్రదాయంగా వస్తున్న ఆచారం, వారి కుటుంబీకుల ఆచారాన్ని తిరుపతిరాయుడు కొనసాగిస్తునే ఉన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన తిరుపతిరాయుడుకు రైతుల కష్టాలు, సమస్యలు తెలుసు. గ్రామంలో అనుమతించిన క్యారీ వల్ల సాగునీరు కలుషితమౌతుందని, సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని రైతుల తరుఫున ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమౌతూ, రైతుల సమస్యలపై అవగాహన ఉన్న కందిమళ్ల తిరుపతి రాయుడుకు చిలకలూరిపేట మార్కెట్ యార్డు చైర్మన్‌గా నియమించాలని నియోజకవర్గ రైతాంగం కోరుతున్నారు. ఆయనకు పదవి లభిస్తే రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి జరుగుతుందని వారు భావిస్తున్నారు. అయితే నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులు ఎవరికి ఉంటాయని మూడు మండలాల ప్రజలు, కందిమళ్ళ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.