SAKSHITHA NEWS

ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిలో అర్జీలను స్వీకరించిన అదనపు కలెక్టర్ లు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ప్రజావాణి అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లు సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు ప్రజల దరఖాస్తులను స్వీకరించారు.

ఖమ్మం అర్బన్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన కూచిపూడి సన తన ఇల్లు వరదల్లో కొట్టుకొని పోయిందని, తన పేరు సెకండ్ లిస్టులో సీరియల్ నెంబర్ 81 లో ఉన్నదని, తనకు ఇంతవరకు ఎటువంటి సహాయం రాలేదని, తనకు సాయం అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, వెంటనే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఖమ్మం అర్బన్ మండలం కైకొండాయి గూడెంకు చెందిన కట్ల రమాదేవి తనకు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడవ కాన్పు జరిగిందని, బాబుకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేయడం లేదని, దీని గురించి చాలా రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నామని బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, రెవెన్యూ డివిజన్ అధికారి, ఖమ్మంకు రాస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.

వేంనూరు మండలం కొత్త చౌడవరం గ్రామానికి చెందిన జి.శ్రీను తనకు దివ్యాంగుల కోటాలో చిన్న ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా ఉపాధి అధికారికి రాస్తూ, పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

కొణిజర్ల మండల కేంద్రానికి చెందిన కొర్లపాటి ధనమ్మ తనకు ఇంటి స్థలం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈఈ హౌసింగ్ కు రాస్తూ పరిశీలించి అవకాశం మేర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డీవో ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ పరిపాలన అధికారిణి అరుణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS