SAKSHITHA NEWS

అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారం అందించండి. కమిషనర్ ఎన్.మౌర్య

నగరంలోని అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాదారు. రోజూ ఎంతమంది వస్తున్నారు? ఎన్ని టోకెన్లు ఇస్తున్నారు? ఆహార పదార్థాలు సకాలంలో వస్తున్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయం సిబ్బంది ప్రతి నిత్యం అన్నా క్యాంటీన్లు పరిశీలించి ప్రజలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ఆ సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఏవైనా అవకతవకలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app