
తుడా లేఔట్లలో అన్ని సౌకర్యాలు కల్పించండి. తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యలో ఏర్పాటు లేఔట్లలో ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. తుడా ఆధ్వర్యంలో సూరప్పకశం, నగరి వద్ద ఏర్పాటు చేసిన లేఔట్లను, నగరి, రేణిగుంటలలోని పార్కులను శుక్రవారం ఇంజినీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి ఉపాధ్యక్షులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా లేఅవుట్లలో ప్రజలకు అవసరమైన రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యం పక్కగా ఉండేలా చూడాలని అన్నారు.
అలాగే లేఅవుట్లలో ఉన్న మొక్కలు తొలగించి బాగా ఉండేలా చూడాలని అన్నారు. నగరి లోని లేఔట్ చుట్టూ ప్రహరీ గోడ, రోడ్డు పక్కన లేఔట్ తెలిసేలా ఆర్చిని ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కుల్లో ఎండిన మొక్కలు తొలగించి, నూతనంగా మొక్కలు నాటాలని అన్నారు. పార్కులను సుందరీకరణ చేసి, మొక్కలు ఎండి పోకుండా నీరు పెట్టాలని అధికారులను ఆదేశించారు. రేణిగుంట లోని పార్కు సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, సిపిఓ దేవికుమారి, డి.ఈ.భాష, ఉద్యానవన శాఖ అధికారి మాలతి, సర్వేయర్ దేవానంద్, తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app