తగ్గించిన పాల సేకరణ ధరను పెంచాలని పరవాడ లో నిరసన
29న విశాఖ డైరీ ని ముట్టడిస్తాం – సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి.
సాక్షిత :- విశాఖ పాల డైరీ పాల సేకరణ ఐదు రూపాయలు ధరను తగ్గించి రైతుల ఆదాయాలకు గండి కొట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉదయం పరవాడ లోని పాల సేకరణ కేంద్రం వద్ద రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ డైరీ కి పాలు సేకరిస్తున్న రైతులకు అర్ధాంతరంగా ఆవుపాల ధర ను తగ్గించి రైతులపై పెను భారాన్ని మోపడాన్ని రైతులంతా వ్యతిరేకించాలని, ఇప్పటికే పాల సేకరణ రైతులకు ఇవ్వాల్సిన బోనస్ నివ్వకుండా విశాఖ డైరీ ఎగ్గొట్టారని అన్నారు. ఒక వైపు పశు దానాకు విపరీతంగా ధర పెంచి రైతులు పై భారాలు మోపుతున్నారని అన్నారు.
అంతే కాకుండా పాల రైతుల డబ్బులతో డైరీ కున్న ఆస్తులు పాలకవర్గం ఇష్టానుసారంగా ఖర్చు చేస్తూ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారని, పాల రైతులకు ఇవ్వాల్సిన బోనస్ విషయంలో పాల సేకరణ ధర విషయంలో మాత్రం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. డైరీ యాజమాన్యం తగ్గించిన పాల సేకరణ ధర పెంచకపోతే ఈ నెల 29న విశాఖ డైరీ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాండ్రేగుల రామ సూరప్పారావు, కృష్ణ పాల రైతులు పోతల శంకర్రావు, బొడ్డే అప్పలనాయుడు, రెడ్డి నాయుడు, సతీష్, బండార్ చిన్నోడు ,పైలపైడు నాయుడు, నాగేశ్వరరావు, పైల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.