గురుకులాల్లో జరుగుతున్నవిద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట……ఏబీవీపీధర్నా
విద్యార్థుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే………. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్
సాక్షిత వనపర్తి
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల చావుకేకులతో గురుకులాలు మారం రోగుతున్నాయని గురుకుల లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి కాకముందుకే ఇప్పటివరకు 49 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని పేద విద్యార్థులు చదువులు పూర్తిచేసుకుని పట్టాలతో రావాల్సిన విద్యార్థులు శవాలుగా మారుతూ పోస్టుమార్టానికి తరులుతున్నారని కొంతమంది పాముకాటుకు మరికొంతమంది ఫుడ్ పాయిజన్ కు అధికారులవేధింపులు తాళలేక మరణించారని ప్రభుత్వం గురుకుల పైన ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం కమిటీలను ఏర్పాటు చేయకపోవడం విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని అందుకే ఇలాంటి సంఘటన చోటుచేసుకుంటున్నాయని విద్యార్థుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు అని అభివర్ణిస్తూ గురుకులాల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో 25 రోజులుగా కేజీబీవీ ఇలలో విద్యార్థులకు విద్యా బోధన జరగడం లేదని పైగా పరీక్షలు దగ్గరకు వస్తున్నాయికానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ జిల్లా కేల్ కన్వీనర్ ఓమేష్ వినయ్ శివ శ్రీకాంత్ బంటి నితిన్ గణేష్ బాలకృష్ణ అరవింద్ చరణ్ పవన్ విష్ణు జ్ఞానేశ్వర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు