ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన

SAKSHITHA NEWS

Promoted as Principals

ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులను సన్మానించిన……….. సీనియర్ జర్నలిస్టు ఓంకార్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
*సాక్షిత వనపర్తి
చాలాకాలంగా ఉపాధ్యాయుల బదిలీలను పెండింగ్లో ఉంచిన ప్రభుత్వం బదిలీల కు శ్రీకారం చుట్టడంతో
పెద్దమందడి మండలం మునిగిళ్ళ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పలుస శంకర్ గౌడ్ పదోన్నతి పై బదిలీ అయి యాపర్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలను స్వీకరించారు వనపర్తి జిల్లా పరిషత్ పనిచేస్తున్న బత్తుల శ్రీనివాసులు పదోన్నతి పై బదిలీ అయి పాన్గల్ మండలం కేతేపల్లి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని సీనియర్ జర్నలిస్టు అయిందాల ఓంకార్ సీనియర్ న్యాయవాది పురుషోత్తం సామాజిక సేవకులు డాక్టర్ పోచా రవీందర్ రెడ్డి గీత ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ యజమాని సునందన్ గౌడ్, ఆప్టికల్స్ సంఘం జిల్లా అధ్యక్షులు పోలీస్ సురేష్ రెడ్డి లతో కలిసి పదోన్నతులు పొందిన వీరు ఇరువురిని శనివారం పోచ సర్వీసెస్ కార్యాలయంలో సన్మానించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ఓంకార్ మాట్లాడుతూ పలుస శంకర్ గౌడ్, బత్తుల శ్రీనివాసులు తనకు మిత్రులు ఆత్మీయులని సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో వీరితో కలిసి చాలా కార్యక్రమాలను నిర్వహించిన అనుబంధం ఉన్నదని వీరు పదోన్నతులు పొందడం పట్ల తమకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page