గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి..
చిలకలూరిపేట పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో షేక్ లాలూ దాదా సాహెబ్ సేవా సమితి ఆధ్వర్యంలో షేక్ సిద్ధాంతి కరిముల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , చిత్రపటాలను స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పుల్లారావు మాట్లాడుతూ గ్రంధాలయం అభివృద్ధికి కృషి చేయనున్నట్టు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అద్యక్షులు తేళ్ల సుబ్బారావు అందించిన 10 వేల రూపాయల విలువగల పోటీ పరీక్షల పుస్తకాలను పుల్లారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి కరిముల్లా, చేవూరి కృష్ణమూర్తి, వార్డు కౌన్సిలర్ కొత్త కుమారి, కొటేశ్వరావు, గ్రంథాలయ అధికారి నాగుల్ మీరా వలి, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి..
Related Posts
కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం
SAKSHITHA NEWS కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..!! భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్ షర్ట్స్ వేసుకుని.. బీఆర్ఎస్…
గణపవరం లో నివాసం ఉంటున్న
SAKSHITHA NEWS గణపవరం లో నివాసం ఉంటున్న గోపి కుమార్తె భవానీ ఆరోగ్యం బాగోలేదని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినారు. పాపని పరామర్శించి ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు అందజేసిన చిలకలూరిపేట…