SAKSHITHA NEWS

డ్వాక్రా సంఘాలను అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదు – ప్రత్తిపాటి

చిలకలూరిపేట

               గత వైసీపీ ప్రభుత్వ హయంలో నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాలను అడ్డుపెట్టుకుని కొందరు అంతులేని అవినీతికి పాల్పడ్డారని, వారెవరినీ వదలిపెట్టబోనని శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మరియు జనసేన సమన్వయకర్త తోటరాజ రమేష్ తెలియజేశారు. 3 మండలాలకు చెందిన APM లు, C.C లు,VOA లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో డ్వాక్రా మహిళల సంతకాలు ఫోర్జరీ చేసి 63 లక్షల రూపాయలు కాజేయడం జరిగిందని, అలాగే 3 మండలాలకు సంబంధించి పలు గ్రామాలలో కోట్ల రూపాయల అవినీతిని చేశారని ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తేవడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా S.P గారితో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ 3 మండలాల పరిధిలోని APM లు సదరు అవినీతికి పాల్పడిన మొత్తం వ్యవహారం పై మీకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తారని, సమగ్ర విచారణ జరిపి, అవినీతికి పాల్పడిన యానిమేటర్ల పై కేసులు నమోదు చేయాలని తెలియజేసారు.

 అలాగే డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు డ్రైవింగు లైసెన్సు ఉండి, ఆసక్తి ఉంటే కేవలం లబ్ధిదారు 10 శాతం సొమ్ము చెల్లిస్తే,90  శాతం సబ్సిడీతో ఆటోలు ఇప్పించే అవకాశం ఉంటుందని, అలాగే డ్వాక్రా మహిళలకు లక్ష నుండి 10 లక్షల ఋణం వరకూ ఎటువంటి షూరిటీలు లేకుండా ఇవ్వడానికి అవకాశం ఉందని తెలిపారు. అయితే బ్యాంకర్లు పూర్తి స్థాయిలో ఈ ఋణాల మంజూరుకు సహకరించడం లేదని పలువురు ఫిర్యాదు చేయగా, లీడ్ బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి, బ్యాంకర్లు సహకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే గత 4 నెలల నుండి VOA(యానిమేటర్లు) లకు జీతాలు రావడం లేదని పలువురు ప్రత్తిపాటి పుల్లారావు కు తెలియజేయగా,DRDA ప్రాజెక్టు డైరెక్టర్ J. బాలు నాయక్ తో మాట్లాడి వెంటనే యానిమేటర్లకు జీతాలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో 3 మండలాల అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్,బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయి బాబు తదితరులు పాల్గొనడం జరిగింది.

SAKSHITHA NEWS