SAKSHITHA NEWS

ప్రజా సమస్యల పరిష్కారానికే “ప్రజా దర్బార్”.. ప్రభుత్వం చీఫ్ విప్ జీవి

ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని తక్షణ పరిష్కార చర్యలు చేపట్టేందుకే “ప్రజా దర్బార్” లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ సీరియస్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. బొల్లాపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి హాజరై ప్రజలనుండి వచ్చిన వినతులను స్వీకరించి సమస్యలను తెలుసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశిస్తూ అర్జీలను సిఫార్సు చేశారు. నూతన పెన్షన్ల దరఖాస్తు ప్రభుత్వం అనుమతించగానే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు. వరికపుడిశల ప్రాజెక్టు పనులు అన్ని అనుమతులతో త్వరలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. RSR పైబడిన భూములకు అర్హులైన రైతులందరికీ హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాటర్ గ్రిడ్డు పథకం ద్వారా బొల్లాపల్లి మండలానికి శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS