పోతరాజు జీవితం నేటి కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శం
విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్. తమ్మిన పోతరాజు జీవితం
కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శం కామ్రేడ్ తమ్మిన పోతరాజు 113వ జయంతి సందర్భముగా కొత్తపేటలోని పోతరాజు గారి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో తొలుత పార్టీ పతాకాన్ని నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆవిష్కరించగా, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పోతరాజు గారి విగ్రహానికి పూలమల వేసి నివాళులర్పిచారు ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ పోతరాజు గారి నీతి, నిజాయితీ, క్రమశిక్షణ నేటి కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శం అన్నారు. విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కామ్రేడ్ పోతరాజు చేసిన కృషి ఫలితముగా అనేక కార్మిక సంఘాలు ఏర్పాటు చేయబడినవి అని ఫలితముగా కార్మికులు అనేక హక్కులను సాదించుకోగలిగారు అని, నగర పశ్చిమ నియోజకవర్గ మొట్టమొదటి శాసన సభ్యునిగా నగర సమగ్రాభివృదికి ఎంతగానో కృషి చేసారు, ముఖ్యముగా కొండ ప్రాంతాలలో ఇళ్లు లేని నిరుపేదలకు బాసటగా నిలిచి వారికి ఇళ్ళు ఏర్పాటు చేపించారని, నగరలో మతసమరస్యాని కాపాడటంలో తన వంతు పాత్ర పోషించారన్నారు.
నేడు కేంద్రంలోని బి.జె.పి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్దిపొందుతూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ నేడు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడులు చేసే పరిస్థితిని తీసుకొనివచ్చారు అన్నారు. నాడు మత సమరస్యతను కాపాడేందుకు పోతరాజు గారు ఏవిధముగా కృషి చేసారో నేటి కమ్యూనిస్టు శ్రేణులు వారిని ఆదర్శముగా తీసుకోని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్సులు లంక దుర్గారావు, నక్క వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు తాడి పైడయ్య, కొట్టు రమణారావు, పంచాదర్ల దుర్గంబ, సంగుల పేరయ్య, తూనం వీరయ్య, డి.వి.రమణబాబు,ఓర్సు భారతి, సింగరాజు సాంబశివరావు, ఎస్.కె. నజీర్, దోనేపూడి సూరిబాబు, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కె.ఆర్.అంజనేయులు, నగర నాయకులు ఆర్. యాకోబు, కంచర్ల నాగేశ్వరరావు, కుర్ర శివకుమార్, ఆర్.మైఖేల్, కరోతి వెంకటేశ్వరరావు, బోర రామకృష్ణ, ఆకుల యేసు, మురుగేషన్ రాము, చీర్ల రామస్వామి, బెవర శ్రీను, దుర్గాసి రవణమ్మ, లంకె సాయి తదితరులు పాల్గొన్నారు.
అభివందనములతో
తూనం వీరయ్య
ఆఫీస్ కార్యదర్శి

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
