మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టిని సారించండి
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశం
హెచ్ఎండిఏ ద్వారా రూ. 10కోట్ల నిధులు
నూతన కాలనీల అభివృద్ధిపై సిబ్బందితో సమీక్ష సమావేశం
రోజురోజుకు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీ పరిధిని పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల రూపకల్పనతో పూర్తి చేయాలని దీనికి సంబంధించి ఎన్ని నిధులైన ప్రభుత్వం వెచ్చించడానికి సిద్ధంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి తదితర మున్సిపల్ అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ నిధుల ద్వారా 10 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొత్త కాలనీలు తదితర ప్రాంతాలలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని నూతన కాలనీలకు సిసి రోడ్లు డ్రైనేజీకి సంబంధించిన పనులతో పాటు విద్యుత్ తదితర అంశాల విషయంలో ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండిఏ నిధులు 10 కోట్ల రూపాయలు ద్వారా కొత్త కాలనీలలో అవసరమైన మేరకు చర్యలు చేపట్టి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని అనేక దశలవారీగా నిధులను విడుదల చేసి పట్టణ ప్రగతికి కృషి చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అవంతరాలు ఇబ్బందులు తల్లితండ్రు తమ శక్తివంతన లేకుండా సిబ్బంది సహకారంతో పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాలను పాటిస్తూ కొత్త కాలనీలలో కూడా అభివృద్ధిపై దృష్టి పెడతామని అక్కడ తీసుకోవాల్సిన చర్యలను త్వరలోనే అధికారులు చేపడతారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తదితరులు ఉన్నారు.
