SAKSHITHA NEWS

వరద బాధితులకు పొంగులేటి ట్రస్ట్ సాయం

  • పంపిణీ సిద్ధమవుతున్న నిత్యావసరాలు, వస్త్రాలు
  • శుక్రవారం నుంచి బాధితులకు అందజేత
  • ఇప్పటికే గత నాలుగు రోజులుగా ట్రస్ట్ తరుపున ఆహారపానీయాల పంపిణీ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

పాలేరు నియోజకవర్గ ముంపు బాధితులకు ప్రభుత్వ సాయంతో పాటు తన వంతు సాయం కూడా అందించాలనే సద్దుదేశ్యంతో తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన పొంగులేటి స్వరాజ్యం- రాఘవ రెడ్డి ట్రస్ట్ తరుపున సాయం చేయాలని తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వాహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో ముంపు బాధితులకు గత నాలుగు రోజులుగా ఆహార పానీయాలను ఉదయం, సాయంత్రం పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బాధిత కుంటుబాలకు బియ్యం, పప్పు, నూనె, కారం, చింతపండు, ఉల్లిగడ్డలు ఇలా పది రోజులకు సరిపడా నిత్యావసరాలతో పాటు మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు, టీ షర్ట్ లతో పాటు కండువాలు, బెడ్ షీట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ముంపుకు గురైన అన్ని కుటుంబాలకు ఈ సాయం అందేలా ప్రణాళిక రూపొందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తో పాటు క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు.


SAKSHITHA NEWS