SAKSHITHA NEWS

ఈ నెల 21న పొంగులేటి ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

పాలేరు నియోజకవర్గంలోని నిరుద్యోగ అభ్యర్థులను రానున్న పోటీపరీక్షలకు సన్నద్ధం చేసే ఉద్దేశ్యంతో రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న పొంగులేటి శ్రీనన్న ఉచిత కోచింగ్ క్యాంప్ ను ఈ నెల 21న బుధవారం ప్రారంభిస్తున్నట్లు.. పొంగులేటి కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఉచిత కోచింగ్ క్యాంప్ కు సంబంధించిన గోడపత్రికను.. క్యాంపు కార్యాలయంలో రైట్ ఛాయిస్ చైర్మన్ మెండెం కిరణ్ తో కలిసి ఆవిష్కరించారు. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం బైపాస్ రోడ్ లో ఉన్న రామ్ లీలా ఫంక్షన్ హాల్ లో ఆగస్ట్ 21న ఉదయం 9గంటలకు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కోచింగ్ క్యాంప్ ప్రారంభమౌతుందని ఆయన తెలియజేశారు. ఇంకా పేరు నమోదు చేసుకోని అభ్యర్థులు ఎవరైనా ఉంటే 8985096699 ఫోన్ నెంబర్ కు వాట్సప్ లో తమ పేరు, ఫోన్ నెంబర్, గ్రామం, మండలం వివరాలను నమోదు చేసుకోవాలని దయాకర్ రెడ్డి కోరారు.


SAKSHITHA NEWS