24 గంటల్లో వృద్ధురాలిపై లైంగిక దాడి చోరీ కేసును చేధించిన పోలీసులు
నిందతుడి నుండి 7 గ్రాముల బంగారం 5 వేల నగదు 14 మొబైల్ ఫోన్లు ద్విచక్ర వాహనం స్వాధీనం……… డిఎస్పి సునీత రెడ్డి
సాక్షిత వనపర్తి ; ఓ వృద్ధురాలిపై అత్యాచారం చోరీకి పాల్పడిన సంఘటన వనపర్తి రూరల్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందినీ 24 గంటల్లో నిందితున్ని అరెస్టు చేసి నిందితుడి నుండి 7 గ్రాముల బంగారం ఐదువేల నగదు 14 మొబైల్ ఫోన్లను ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పేర్కొన్నారు మంగళవారం విలేకరుల సమావేశంలో నేరానికి సంబంధించిన వివరాలను తెలుపుతూ మే 30 న 55 ఏళ్ల వయసు వృద్ధురాలికి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన నిందితుడు కురువ నవీన్ ( 24) మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్ పై ఎక్కించుకుని వనపర్తి రూరల్ స్టేషన్ పరిధిలోని శ్రీ మేధా టౌన్ షిప్ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి వృద్ధురాలుపై లైంగిక దాడి చేసి న అనంతరం అభరణాలు నగదు దొంగలించాడని ఓ వృద్ధురాలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని డి.ఎస్.పి గిరిబాబు సిఐరత్నం నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించి పోలీసులు సిసి టీవీలు మొబైల్ టవర్ లోకేషన్ వంటి సాంకేతిక సహాయంతో నిందితుని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందని విచారణలో నిందితుడు నేరం ఒప్పుకున్నాడని అతని నుండి ఏడు గ్రాములు (40 వేలు విలువ చేసే )బంగారు మంగళసూత్రం చెవి కమ్మలు ఐదు వేల రూపాయల నగదు ఒక కత్తి ఒక మోటార్ బైక్ 14 సెల్ ఫోన్లను నిందితుడి సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకు న్నారు పూర్తి దర్యాప్తు అనంతరం పూర్తి సమాచారం తెలుపుతామని ఎస్పీ తెలిపారు అరెస్టు చేసిన నిందితుని కోర్టులో హాజరు పరుస్తున్నామని ఎస్పీ తెలిపారు కేసును చేదించిన వనపర్తి సిఐ రత్నం ఎస్సైలు కృషికేశ్ హరిప్రసాద్ పోలీస్ కానిస్టేబుల్ నవీన్ గౌడ్ ఆంజనేయులు రఫీ అభిషేక్ యుగంధర్ గౌడ్ లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు ఈ సందర్భంగా ప్రజలు అపరిచితుల మాటలు నమ్మి ఒంటరిగా వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అనుమానస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు
