ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి….
అభివృద్ధి పనుల్లో నాణ్యత, వేగం రెండూ ఉండాలి…
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:ఎన్‌టీపీసీ, . రామగుండం నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి, అంతర్గాం మండలాల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఎన్‌టీపీసీ మిలీనియం హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తే నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తమ మండలాల సమస్యలు, అభివృద్ధి అవసరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై స్పందించిన రాజ్ ఠాకూర్ సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
