SAKSHITHA NEWS

పేకాట స్థావరం పై పోలీసులు దాడి

రూ,,6,35,600/- నగదు, 4 కార్లు,3 బైక్ లు, 15 మొబైల్స్ స్వాధీనం

15 మందిపై కేసు నమోదు……… జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

సాక్షిత వనపర్తి అక్టోబర్ 8

వనపర్తి జిల్లా సరిహద్దులోని పెబ్బేర్ పోలీస్ స్టేషన్ రంగాపూర్ శివారులోని కృష్ణానది ప్రక్కన ఒక గోదాంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ లకు విశ్వసనీయమైన సమచారం మేరకు
స్పెషల్ సి, సి,ఎస్, సీఐ రవిపాల్, పెబ్బేర్ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి, సిబ్బంది, మరియు వనపర్తి పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరం పై దాడి నిర్వహించి 15 మందిని అరెస్టు చేసి 6,35,600/- రూపాయాల నగదు,
4 కార్లు, 4బైక్ లు మరియు 15 మొబైల్స్ పోన్ లు స్వాధీనం చేసుకొని పెబ్బేరు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు
కేసు నమోదు అయిన వారి వివరాలు
1.పల్లె వెంకటయ్య – గుడ్డం దొడ్డి, ధరూర్

  1. దౌలు – దౌధర్ పల్లి, గద్వాల్
  2. గుంజ పల్లి వీరేష్, మట్టి పేట రాయచూర్
  3. ఆంజనేయులు, పారుచర్ల, ధరూర్
  4. అశోక్ – గద్వాల్
  5. ఉప్పరి గోపాల్ – ఎర్రవల్లి
  6. మద్ది లేటి, కొండేర్, ఎర్రవల్లి
  7. జలీల్ భాషా, రాయచూర్
  8. పాడ రామిరెడ్డి – ఎర్రవల్లి
  9. సత్య స్వరూఫ్ – గద్వాల్
  10. కూర్వ వీరన్న – కొండేరు,ఎర్రవల్లి
  11. కృష్ణయ్య , రంగాపురం, పెబ్బేరు
  12. వెంకటన్న, కొండేరు, ఎర్రవల్లి.
  13. నాగి రెడ్డి, చెలిమిల్ల, పెబ్బేరు .
  14. నరసింహ రెడ్డి , పెద్దొడ్డి, మల్దకల్లు లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీ చుట్టు పక్కల పరిసర ప్రాంతాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లు అనుమానం కలిగిన ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ తెలిపారు.

SAKSHITHA NEWS