SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 07 at 6.09.02 PM

పాలకుల నిర్వాకంతో పోలవరం 2004 నుంచి 2 సార్లు బలైంది: చంద్రబాబు

పట్టిసీమ: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్వాకం వల్లే పోలవరం పదేళ్లు ఆలస్యమైందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) మండిపడ్డారు. రాష్ట్రానికి వరమైన పోలవరం ప్రాజెక్టు..

2004 నుంచి పాలకుల నిర్వాకం వల్ల రెండు సార్లు బలైందని ధ్వజమెత్తారు. పట్టిసీమ వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితిగతులపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2004లో పోలవరానికి టెండర్లు మధుకాన్, శీనయ్య సంస్థలకు దక్కితే కక్ష సాధింపు చర్యలతో పనులు రద్దు చేశారని ఆరోపించారు. హెడ్ వర్క్స్‌ను నిర్లక్ష్యం చేసి కమీషన్ల కోసం కాలువ పనులపై దృష్టి పెట్టారని దుయ్యబట్టారు. 2004 నుంచి 2014 వరకు కేవలం 5 శాతం పనులు మాత్రమే జరిగాయని విమర్శించారు. రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలూ పరిష్కారం కాలేదన్నారు..

”ఐఐటీహెచ్‌ నివేదిక మేరకు వైకాపా వల్లే డయాఫ్రమ్‌ వాల్ దెబ్బతింది. పోలవరం ఆపేందుకు గతంలో జగన్‌ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కేంద్రం ఆమోదించకుండా దిల్లీలో జగన్‌ లాబీయింగ్‌ చేశారు. అబద్ధాలతో పోలవరం మీద పుస్తకాలు ప్రచురించారు. జగన్‌ వచ్చాక కమీషన్ల కోసం గుత్తేదారులను మార్చారు. గుత్తేదారును మార్చేందుకు జగన్‌ బంధువుతో విచారణ చేయించారు. ప్రాజెక్టు నిర్మాణంలో మా హయాంలో అవినీతి లేదని కేంద్రం చెప్పింది. 2020లో వచ్చిన 22 లక్షల క్యూసెక్కుల వల్ల డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌లు పూర్తి చేయకే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ వద్దకు నీరు వెళ్లింది. జగన్‌ వచ్చాక ఏడాదిన్నరపాటు ప్రధాన డ్యామ్‌ దగ్గర పనులు చేయలేదు” అని చంద్రబాబు విమర్శించారు..


SAKSHITHA NEWS