SAKSHITHA NEWS

అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో అధ్యక్షుడు సయ్యద్ తో పాటు మరో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ యొక్క విషాద మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతని కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోందని ప్రధాని మోడీ తన ట్వీట్ లో తెలిపారు.

WhatsApp Image 2024 05 20 at 12.43.48

SAKSHITHA NEWS