SAKSHITHA NEWS

పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల శారీరక దారుఢ్య పరీక్షలు||

  • విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలతో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో స్టెఫెండరీ
సివిల్ పోలీసు కానిస్టేబుల్ (పురుషులు, మహిళలు), ఎపిఎస్పి పురుషులు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలుకు ప్రిలిమినరీ
పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష (పి.ఎమ్.టి), ఫిజికల్ ఎఫీషియన్సీ పరీక్షలను
(పి.ఈ.టి) విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండులో డిసెంబరు 30 నుండి జనవరి 22 వరకు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా
ఎస్పీ వకుల్ జిందల్ డిసెంబరు 27న తెలిపారు.

విజయనగరం జిల్లాలో 9152మంది అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
వారిలో మహిళా అభ్యర్ధులు 1584 మందికాగా, 7568మంది పురుష అభ్యర్థులు ఉన్నారన్నారు. అభ్యర్థులు ఇప్పటికే
ఎస్.ఎల్.పి.ఆర్.బీ. నుండి డౌన్లోడు చేసుకున్న హాల్ టిక్కెట్స్ తో తమకు కేటాయించిన తేదీన, ఉదయం 4గంటలకు పోలీసు
పరేడ్ గ్రౌండు వద్ద హాజరుకావాలన్నారు. పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమతోపాటు
తమ విద్యార్హతులను తెలిపే ఎస్.ఎస్.సి. (10వ తరగతి), ఇంటర్మీడిట్, కేస్ట్, నేటివిటీ, స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ను తీసుకు
రావాలన్నారు. ప్రత్యేక కేటగిరిలో రిజర్వేషను పొందగోరే అభ్యర్థులు ఆయా రిజర్వేషన్లును దృవీకరించే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను తీసుకురావాలన్నారు. వీటితోపాటు వెరిఫికేషను నిమిత్తం ఒక సెట్ గెజిటెడ్ అధికారితో అటెస్టేషను చేసిన జెరాక్స్
కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురాని అభ్యర్థులను తిరస్కరిస్తామన్నారు. ఏదైనా
కారణంతో ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని రావడంలో విఫలమైతే, మరో రోజున ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని, పరీక్షలకు
హాజరుకావచ్చునని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళా కానిస్టేబులు ఉద్యోగాలకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలను
జనవరి 3,4,6 తేదీల్లో నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

పి.ఎం.టి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషను చేస్తామని, అన్ని రకాల
సర్టిఫికేట్స్ పరిశీలన పూర్తయిన తరువాత, అభ్యర్థులకు బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అనంతరం,
అభ్యర్ధులకు ఎత్తు, ఛాతీ కొలతలను పూర్తి చేసి, అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్ధులకు ముందుగా 1600 మీటర్ల పరుగు నిర్వహిస్తామని, అందులో అర్హత పొందిన అభ్యర్థులకు
మాత్రమే 100మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సివిల్ కానిస్టేబులు ఉద్యోగాలకు 100మీటర్ల
పరుగు లేదా లాంగ్ జంప్ ఈవెంట్లో ఒకదానిలో అర్హత సాధించినా, తదుపరి రాత పరీక్షకు అర్హత సాధించినట్లుగా
పరిగణిస్తామన్నారు. ఎపిఎస్సీ కానిస్టేబులు ఉద్యోగాలకు 1600మీటర్ల అర్హత పరీక్షతోపాటు, 100మీటర్లు, లాంగ్ జంప్
రెండు ఈవెంట్స్ లోను తప్పనిసరిగా అర్హత సాధించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అభ్యర్థులకు నిర్వహించే
శారీరక దారుఢ్య పరీక్షల్లో సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించడంతోపాటు, సిసి కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని జిల్లా
ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

||పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారీల మాట నమ్మి మోసపోవద్దు||

పోలీసు కానిస్టేబులు ఉద్యోగాల పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా
నిర్వహిస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని అభ్యర్ధులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కోరారు. కానిస్టేబులు ఉద్యోగాలు
ఇప్పిస్తామని ఆశలు కల్పించే దళారులు, మోసగాళ్ళ మాటలు నమ్మవద్దని, ఎవరైనా ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వసూలు
చేసినట్లయితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం||


SAKSHITHA NEWS