తెలంగాణలో కొన్ని రోజుల నుంచి రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్

తెలంగాణలో కొన్ని రోజుల నుంచి రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్

SAKSHITHA NEWS

Phone tapping which has been causing political ruckus in Telangana since few days

తెలంగాణలో కొన్ని రోజుల నుంచి రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు ఇందులో ఓ ఐటీ కంపెనీ కూడా భాగం ఉందనే అనుమానం కలుగుతోంది. తాజాగా ఆ సంస్థలో సోదాలు చేయడం కూడా సంచలనంగా మారుతోంది.
ఫోన్ టాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. SIBకి టెక్నికల్ సపోర్టు అందిస్తున్న ఇన్నోవేషన్ ల్యాబ్ లో సిట్ అధికారులు సోదాలు చేశారు. కీలకమైన డాక్యుమెంట్స్, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్ లు సీజ్ చేశారు. మూడు సర్వర్లు, ఐదు మినీ డివైసెస్ తోపాటు హార్డ్ డిస్క్ లు సిట్ అధికారులు తమతో తీసుకెళ్లారు.
కొన్నేళ్ల నుంచి ఎస్ఐపీకి టిక్నికల్ సపోర్టు ఇస్తున్న ఇన్నోవేషన్ ల్యాబ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కుంది. దీంతో ఆ సంస్థ యాక్టివిటీస్ పై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ ఉదయం ఇన్నోవేషన్ ల్యాబ్ ఛైర్మన్ రవి కుమార్ ఇల్లు కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఈ సంస్థ బెంగళూరు, హైదరాబాద్ లో ఆఫీస్ లు నిర్వహిస్తోంది. రెండు ప్రాంతాల్లోని ఆఫీసుల్లో కూడా తనిఖీలు చేపట్టారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ సంస్థ ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ప్రతిపక్ష నేతల ఇళ్లతోపాటు మూడు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇలా ప్రతిపక్ష నేతలు సహా కీలకమైన వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ లో ఈ సంస్థ పాత్ర చాలా ఉందన్న అనుమానంతో నేటి సోదాలు సాగాయి.
బెంగళూరు హైదరాబాద్ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టిన సిట్ బృందాలు అక్కడ సిబ్బందితో కూడా మాట్లాడారు. వారి స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్నారు. కీలక పత్రాలు, హార్డ్ డిస్కలు, సర్వర్ లను స్వాధీనం చేసుకున్నారు. రవికుమార్ ఇంట్లో దాచిపెట్టిన హార్డ్ డిస్క్ లను కూడా పోలీసులు తీసుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్లో కీలక సూత్రధారిగా భావిస్తున్న ప్రణీత్రావు… ఈ ల్యాబ్ సహాయంతోనే ప్రతిపక్షాలను ట్రాప్ చేశారని అంటున్నారు. ఎస్ఐబీకి టెక్నికల్ సపోర్ట్ అని చెబుతున్నా… చేసేది మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.


SAKSHITHA NEWS