అతిధి అధ్యాపకుల సమస్యల పై వినతిపత్రం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
స్థానిక ప్రభుత్వ ఎస్ ఆర్ & బి జె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల కు విచ్చేసిన డిగ్రీ కళాశాల రీజినల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్. డి. రాజేందర్ సింగ్ కు వినతి పత్రం సమర్పించారు. గత 10 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అతిధి అధ్యాపకులు కు 12 నెలలు కన్సాలిడేటెడ్ పేమెంట్ ఆటో రెన్యువల్ మరియు గత 4 నెలలుగా జీతాలు రాక అప్పుల కు వడ్డీలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజ్ లు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అతిధి అధ్యాపకులు వెంటనే జీతాలు చెల్లించాలి అని మరియు12 సంవత్సరాలగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తూ ప్రభుత్వం ప్రతి సంవత్సరం డెమో లు పెడుతూ సీనియర్ అధ్యాపకులు మానసిక క్షోభకు గురిచేస్తూ, అటు వయోపరిమితి తో అటు ప్రభుత్వ ఉద్యోగాలలో పోటీ పడలేక మరియు జీతాలు గంటల ప్రాతిపదికన చెల్లించటం వల్ల దసరా,దీపావళి,సంక్రాంతి రంజాన్,క్రిస్టమస్ సెలవులతో కనీసం 8 నెలలు కూడా జీతాలు రాక అవికూడా సక్రమంగా ప్రభుత్వం విడుదల కాక రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1940 అతిధి అధ్యాపకులు ప్రతి సంవత్సరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
కావున ప్రభుత్వ పెద్దలు తమ సమస్యలు పై సానుకూల దృక్పథం స్పందించగలరని రీజినల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ డి. రాజేందర్ సింగ్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేసున్న అతిధి అధ్యాపకులు స్థానిక ఎస్సార్& బి జె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాలలో వినతి పత్రం సమర్పించారు. రీజినల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్.డి. రాజేందర్ సింగ్ దీనిపై సానుకూలంగా స్పందించి తమ సమస్యలను కమిషనర్ దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తా అని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ ఆర్&బిజెఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పనిచేస్తున్న 33 మంది అతిధి అధ్యాపకులు పాల్గొన్నారు.