SAKSHITHA NEWS

వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి.

అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సుజనా చౌదరి..

ఇటీవల సంభవించిన బుడమేరు విపత్తు వలన ప్రాణనష్టం తో పాటుగా భారీగా ఆస్తి నష్టం సంభవించిందని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ ను రక్షించాలని ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు.
మంగళవారం ఏపీ శాసనసభలో ఆయన ప్రసంగించారు .. బుడమేరు వరద ముంపు నివారణ, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని ఆయన ప్రశ్నించారు.. బుడమేరు తో పాటు రాష్ట్రంలో
ప్రతి ఏటా కురిసే భారీ వర్షాలకు, వరదలకు శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు.
గత పదియేళ్ళుగా హుదుద్, తిత్లి తో పాటుగా అనేక పెను తుఫానులను ఎదుర్కొంటున్నామన్నారు
భవిష్యత్తులో తుఫాన్లు వరదలు వలన ధన ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా ఏ ఐ టెక్నాలజీ ద్వారా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు . జల వనరుల శాఖ, రోడ్లు భవనాల శాఖ , డిజాస్టర్ మేనేజ్ మెంట్ సమన్వయంతో పని చేయాలనీ కోరారు..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీల , అవుట్ ఫాల్ డ్రెయిన్ ల నిర్వహణ సరిగా చేయడం లేదన్నారు.
భవిష్యత్తులో బుడమేరు కు వరదలు సంభవించకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారో తెలియజేయాలని సుజనా ప్రశ్నించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app