SAKSHITHA NEWS

దశాబ్దాలుగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జూలై 15 నాటికి రిటైనింగ్‌ వాల్స్‌ పనులు పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.ముంపు నివారణకు మున్నేరు ఒడ్డున శాశ్వత పరిష్కారం కోసం రూ.690కోట్లతో 17కి.మీ. ఆర్‌సీసీ రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తున్నామని, ఈపనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణానికి భూమి కోసం భూ యజమానులతో మాట్లాడాలని సూచించారు. మరోవైపు సంక్రాంతి పండుగలోపు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.


SAKSHITHA NEWS